అధికారంలో ఉంటే ఏమైన చేయొచ్చనే గర్వం సాటి మనిషికి కనీసం గౌరవాన్ని ఇవ్వాలనే భావనను తొలగిస్తుంది. పెద్దవాడు ఏప్పుడు చిన్నవాడిపై అజాయమాయిషి చెలాయిస్తాడు. చుట్టూ ఎంత మంది ఉన్నా నన్ను ఏం చేస్తారనే ధీమాతో ఎస్సై ఓ ఉద్యోగిని చెంపమీద కొట్టాడు. అసలు ఎందుకు ఇలా చేశాడంటే.. ఆలస్యంగా రావడంతో బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి విమానాశ్రయ సిబ్బంది నిరాకరించారు. దాంతో ఆగ్రహించిన ఎస్సై ర్యాంక్ క్యాడర్ వ్యక్తి విమానాశ్రయ సిబ్బంది చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటన అహ్మాదాబాద్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
గుజరాత్‌కు చెందిన పోలీసు అధికారి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి మంగళవారం అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారంతా ఢిల్లీకి వెళ్లడం కోసంస్పైస్‌జెట్ ఎస్‌జీ-8194 విమానంలో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అయితే వారు ఆలస్యంగా రావడంతో సిబ్బంది బోర్డింగ్‌కు అనుమతివ్వలేదు. దాంతో పోలీసు అధికారి, స్పైస్‌జెట్ స్టాఫ్‌తో గొడవకు దిగాడు. ఘర్షణ ముదిరింది.. తమకు బోర్డింగ్ పాస్ నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు అధికారి.. సిబ్బంది చెంప పగలకొట్టాడు
అంతే ఎస్సైతో పాటు ఉన్న మిగతా ఇద్దరు ప్రయాణీకులకు, సిబ్బందికి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. పరిస్థితిని నియంత్రించడానికి విమానాశ్రయ భద్రతా సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్ స్టాఫ్ రంగంలోకి దిగారు. అనంతరం అందరిని…విమాన్రాశయ ఉద్యోగిని, సదరు పోలీసు అధికారితో పాటు ఉన్న మిగతా ఇద్దరిని స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం విమానాశ్రయ సిబ్బందికి ఆ పోలీసు అధికారి మధ్య రాజీ కుదరడంతో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. కానీ ఆ పోలీసు అధికారిని మాత్రం విమానంలో ప్రయాణించేందుకు సిబ్బంది అనుమతించలేదట.
అధికారం చేతిలో ఉందికాదా.. ఏం చేసినా ఎవరూ ఎమనరూ అనుకుంటే ఈ ఎస్సైకి ఎదురైన అనుభవమే అందరు రుచి చూడాల్సి వస్తుంది. ఆత్మాభిమాన్ని మించినది మరొకటి ఉండదు.. అది దెబ్బతీసినందకే ఆ పోలీసు అధికారికి స్టేషన్లో రాజీ కుదుర్చుకునే స్థాయికి తీసుకొచ్చింది.