ఏపీలో బీజేపీని ఎవడూ కాపాడలేడు… ఇదిగో పక్కా ప్రూఫ్!

-

ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ అనంతరం బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు వచ్చిన కొత్తలో ఫుల్ హడావిడి చేశారు! అయితే ఈ మధ్య కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నారు! కారణం ఏమిటన్న సంగతి కాసేపు పక్కనపెడితే.. టీవీ డిబేట్లలో తన ప్రతాపం చూపించే విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఫుల్ బిజీగా ఉన్నట్లున్నారు! ఇక మిత్రుడు పవన్ కి కూడా ఆ ఆలోచన రాలోదే లేక డైరెక్ట్ క్రెడిట్ జనసేనకు కాదని ఆగారో తెలియదు కానీ.. ఆగారు! ఏపీలో 2024 లో తమదే అధికారం అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు అందుకు అందివచ్చిన అవకాశాలను సైతం క్యాష్ చేసుకోలేకపోతున్నారు. ఇక  అందుకు సజీవ సాక్ష్యం ఇది!!

అవును.. విజయవాడలో శుక్రవారం రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రారంభోత్సవం చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి బెజవాడ కనకదుర్గ ఫ్లైవోవర్ కాగా రెండోది బెంజిసర్కిల్ వద్ద నిర్మించిన ఫ్లైవోవర్. మరి వీటికోసం ఎవరు అధికమొత్తంలో డబ్బులు ఇచ్చారు.. వీటి నిర్మాణాలు ఎవరి వల్ల పూర్తయ్యాయి.. అనే విషయాలు బీజేపీ నేతలు పుష్కలంగా మరిచిపోయారు! కేవలం 2024లో ఎవరికి ఏ కేబినెట్ పోస్ట్ కావాలనే విషయంలో వారంతా తలమునకలవ్వడం వల్ల ఈ విషయాన్ని ప్రమోట్ చేసుకోలేకపోతున్నట్లున్నారు!

అవును… బెజవాడ కనకదుర్గ ఫ్లైవోవర్, బెంజిసర్కిల్ వద్ద నిర్మించిన ఫ్లైవోవర్ రెండూ కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక శంకుస్థాపన చేసుకుని పూర్తి అయినవే! దీనికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు 355 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర సర్కారు 147 కోట్లు ఇచ్చింది. మరి అలాంటప్పుడు ఏపీ బీజేపీ నేతలు ఈ విషయాన్ని ఏ రేంజ్ లో పొలిటికల్ గా క్యాష్ చేసుకోవాలి..  ఎంతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..? కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు! ఏదైనా గుడికి రంగు వెలిసిపోతే చెప్పండి వెళ్లి ధర్నాలు చేస్తాం తప్ప ఇలాంటివి చేయం అన్నట్లుగా ఉంది వారి వ్యవహారం!

సో… ఏపీ బీజేపీ నేతలు ఇలానే ఉంటే.. ఇక ఏపీలో బీజేపీని ఎవరూ కాపాడలేరు! ఇంతకు మించిన ప్రూఫ్ ఏమి కావాలి? ఇలాంటి వారు జగన్ ని ఓడించి 2024లో ఎన్నికల్లో గెలుస్తారంట! చంద్రబాబుని తొక్కేసి.. జగన్ కి ఆల్టర్నేటివ్ అవుతారంట.. అనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపించడం కొసమెరుపు!!

Read more RELATED
Recommended to you

Latest news