కేన్సర్ రోగులకే కరోనాతో అతిపెద్ద ముప్పు…!

-

కేన్సర్ రోగులకే కరోనాతో అతి పెద్ద ముప్పు అని పరిశోధకులు తెలిపారు. అమెరికాలో నిర్వహించిన సర్వేలో ఇతర కరోనా రోగులతో పోలిస్తే… కరోనా బారిన పడిన క్యాన్సర్ రోగులు ఆసుపత్రిలో ఎక్కువగా చేరే అవకాశం ఉంది అని, వారు ఐసియులో చేరతారు అని అధ్యయనంలో గుర్తించారు. రాయిటర్స్ లో దీనికి సంబంధించి ఒక నివేదిక ప్రచురించారు. ఈ అధ్యయనం అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ జర్నల్‌ లో తొలుత ప్రచురించబడింది.

ఈ అధ్యయనంలో మొత్తం 23,000 మంది క్యాన్సర్ రోగులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా యుఎస్ వెటరన్స్ అఫైర్స్ ఆరోగ్య కేంద్రాల్లో వీరిని పరీక్షించారు. 23,000 మందిలో, సుమారు 1,800 (7.8 శాతం) మంది కరోనా బారిన పడ్డారు. వయసు ప్రభావం ఏమీ లేకుండానే పడ్డారు. “ఘన కణితులు (8 శాతం) ఉన్నవారి కంటే రక్త క్యాన్సర్ ఉన్న రోగులలో 11 శాతం కోవిడ్ -19 ఎక్కువగా ఉందని తెలిపారు. కోవిడ్ -19 ఉన్న క్యాన్సర్ రోగులలో మరణాల రేటు 14 శాతం ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news