ఒంగోలులో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీల కలకలం

-

ఏపీ రాజకీయాల్లో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ హాట్ టాపిక్ గా మారారు. ఒంగోలులో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీల కలకలం రేపాయి. ఒంగోలు జిల్లాలో నారా లోకేష్ పర్యటన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల ఏర్పాటుతో చర్చనీయాంశంలా ఈ వ్యవహారం తయారు అయింది.

ఒంగోలు నగరంలోని పలు ప్రధాన సెంటర్లలో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండుగే అంటూ ఫ్లెక్సీలు వేయించారు గుర్తు తెలియని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వెలిసిన ఒంగోలులో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. టిడిపి పార్టీ ఎక్కడ సభలు, మీటింగ్స్ జరిపిన ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే, ఈ సారి ఒక అడుగు వేసి.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అంతే !

Read more RELATED
Recommended to you

Latest news