నూతన్‌ నాయుడుకు చుక్కెదురు

పెందుర్తి దళిత యువకుడు శిరోముండనం కేసులో నిందితుడు నూతన్‌ కుమార్‌ నాయుడుతో పాటు ఆయన భార్య ప్రియ మాధురితో సహా మరికొందరు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ని న్యాయస్థానం తిరస్కరించింది. నగరంలోని ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వెంకట నాగేశ్వరరావు మంగళవారం తీర్పు నిచ్చారు.

వాదనలు విన్న న్యాయమూర్తి కేసు ప్రాథమిక స్థాయిలో ఉన్నందున బెయిలు మంజూరు సాధ్యం కాదన్నారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సలాది శ్రీనివాసు తమ వాదనలు వినిపించారు. కాగా, పసిపిల్లలను విక్రయించిన కేసులో సృష్టి ఆస్పత్రి వైద్యులకు న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది.