మాజీ క్రికెటర్ మృతి.. బీసీసీఐ సంతాపం..

భారత మాజీ క్రికెటర్ సదాశివ రావ్ జీ పాటిల్ 86ఏళ్ళ వయస్సులో తుది శ్వాస విడిచారు. భారత్ తరపున 79వ టెస్ట్ ఆటగాడిగా ఆడిన సదాశివరావ్ జీ పాటిల్ న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచుతో అరంగేట్రం చేసాడు. 1955లో జరిగిన ఈ మ్యాచులో సదాశివరావ్ జీ పాటిల్ తన బౌలింగ్ లో వికెట్లు కూడా తీసుకున్నాడు. 27పరుగుల తేడాతో ఆ మ్యాచ్ ఇండియా గెలిచింది. ఈ విషయాన్ని ప్రస్తావించిన బీసీసీఐ సదాశివ రావ్ జీ పాటిల్ మృతికి సంతాపం తెలియజేసింది.

మీడియం పేసర్ గా అరంగేట్రం చేసిన సదాశివ రావ్ జీ ఒక్క టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత దేశీయ క్రికెట్ కే పరిమితమయ్యారు. మహారాష్ట్ర టీమ్ తరపున 36ఫస్ట్ క్లాస్ మ్యాచులాడిన సదాశివ రావ్ జీ 83వికెట్లు పడగొట్టారు. లాంక్ షైర్ లీగ్ లో 52మ్యాచులాడి 111వికెట్లు తీసారు. దేశీయ క్రికెట్ లో మహరాష్ట్ర టీమ్ కి కెప్టెన్ గా సేవలందించారు. 86ఏళ్ళ వయస్సులో మహారాష్ట్ర, కోల్హాపూర్ లోని తన నివాసంలో స్వర్గస్తులయ్యారు.