భారతదేశంలో అరుదుగా లభించే అలుగు జంతువుని అటవీ అధికారులు అక్రమార్కుల దగ్గర నుండి కాపాడారు. ఆ అలుగు ను అమ్మడానికి అతితెలివి ఉపయోగించడంతో అడ్డంగా బుక్కయ్యారు ఆ కేటుగాళ్లు. వారి దగ్గర ఉన్న అలుగు ను ఏకంగా రూ. 65 లక్షలకు విక్రయించేందుకు రెడీ గా ఉన్న మొత్తం నలుగురు అక్రమార్కులను పోలీసులు గుర్తించారు. అలుగు ను అమ్మేందుకు వారు యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో అది కాస్తా ట్రాఫిక్ ఇండియా విషయాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు తెలియజేసింది.
దీంతో అటవీశాఖ అధికారులు కొనుగోలుదారుల ముసుగులో వెళ్లి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ అధికారి గుంటూరులో నేడు పూర్తి వివరాలను వెల్లడించారు. జంతువుల్ని వేటాడే అక్రమార్కులను ఎవరైనా ప్రజలు గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారి ప్రదీప్ కుమార్ కోరారు.