బ్రేకింగ్ : అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ప్రమాదం

-

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎఫ్ ఎం వార్డుకు సరఫరా అవుతున్న ఆక్సిజన్ పైప్ లైన్ లీక్ అయింది. దీంతో ఆ వార్డులోని రోగులు ఏమవుతుందో అనే భయంతో పరుగులు తీశారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పది రోజుల్లో ఈ ప్రమాదం రెండో ప్రమాదం అని చెప్పచ్చు. ఎందుకంటే పది రోజుల క్రితం కోవిడ్ బాధితులు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వార్డు పక్కన వున్న గదిలో షార్ట్ సర్క్యూట్ అయింది. సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో ఆరోజున కోవిడ్ బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు.

అయితే ఆ రోజు ప్రమాదం జరగడంతో ఆ కోవిడ్ బాధితులను అందరినీ ఎఫ్ ఎం వార్డుల్లోకి తరలించారు అధికారులు. అప్పటి నుండి వారంతా అదే వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈరోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఎఫ్ ఎం వార్డులోని ఆక్సిజన్ పైప్ లీకేజ్ అయ్యింది. అయితే ఇప్పుడు టెన్షన్ తో కరోనా రోగులు అందరూ బయటకు పరుగులు తీశారు. ఇక ఆస్పత్రిలో వరుస ప్రమాద సంఘటనలు జరగడంతో కోవిడ్ బాధితులు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పైప్ లీకేజ్ ని ఆపేందుకు సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news