ఆ విషయంలో ఎన్టీఆర్ కి ఒక రూలు.. బాబుకి మరో రూలు!!

-

చంద్రబాబుకు ఇప్పటివరకూ జరిగిన అన్ని విషయాల్లోనూ స్వయంకృతాపరాధాలే ఎక్కువ అనే కామెంట్ గత కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తుంది! కొన్ని సంఘటనలు చూసిన తర్వాత, కొన్ని పరిశీలనలు చేసిన అనంతాం అవి నిజమనేభావన కన్ ఫాం అయిపోతూ ఉంటుంది! ఇంతకూ బాబు కు ఇప్పుడున్న మైనస్ లు చాలక.. కొత్తగా కోరి ఉంచుకుంటున్న మైనస్ ల లిస్ట్ లో కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి!

అవును.. మొహమాటానికి పోతున్నారో లేక తనకు సంబందించిన సీక్రెట్స్ ఏమైనా వారివద్ద ఉన్నాయో ఏమో తెలియదు కానీ… కొంతమంది నేతలు పార్టీకి భారమని తెలిసినా కూడా భరిస్తున్నారు బాబు! అల్టిమేట్ గా వ్యక్తుల కంటే పార్టీ గొప్పది అని ఎన్టీఆర్ విషయంలో చెప్పుకొచ్చిన బాబు.. తన విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ సూత్రం అప్లై చేయడం లేదు!

ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో.. బాబు వర్ఘం బలంగా చెప్పిన మాట… “వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం” అని! మరి పెద్దయన విషయంలోనే ఆ సూత్రం అప్లై చేసిన బాబు… తన విషయానికి వచ్చేసరికి తనకూ, తన మైనస్ బ్యాచ్ కు ఎందుకు అప్లై చేయడం లేదు! వీరంతా పార్టీకి భారం, బరువు అని బాబుకు తెలిసిన ఎందుకు వారిస్థానంలో మరో యువకుడికి అవాశం కల్పించడం లేదు! ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలను బలంగా డిస్టర్బ్ చేస్తున్న ప్రశ్న ఇది!

ఉదాహరణౌ నెల్లూరు జిల్లాలో ఐదుసార్లు వరుసగా టీడీపీ నుంచి ఓడిపోయిన సోమిరెడ్డి ని బాబు ఎందుకు అంతలా మోస్తున్నట్లు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని ఎందుకు ప్రోత్సహించడం లేదు! పైగా మంత్రి పదవులు ఇస్తున్నారు! పోని సోమిరెడ్డి ఎన్నికల్లో గెలవకపోయినా పార్టీకి చేసింది ఏమైనా ఉందంటే… ప్రెస్ మీట్ లు పెట్టడం తప్ప మరొకటి లేదు! ఇలాంటి నేతలు టీడీపీకి జిల్లాకు నలుగురైదుగురు తక్కువ కాకుండా ఉన్నారు!!

ఈ విషయంలో గుంటూరు జిల్లాలో యరపతినేని.. పశ్చిమగోదావరి జిల్లాలో చింతమనేని వంటివారు కేవలం ఉదాహరాణలు మాత్రమే.. ఇలాంటి పేర్లు ప్రతీ జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి! మరి ఈ విషయంలో బాబు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? తనతోపాటే పార్టీ కూడా వృద్దాప్యంలోకి పోవాలని కోరుకుంటున్నారా? లేక తనకు ఆ బ్యాచ్ తోనే కంఫర్ట్ అని ఫీలవుతున్నారా? లేక ఏమైనా వారికీ బాబుకీ లొసుగులు ఉన్నాయా? అన్నది బాబే చెప్పాలి!! అలాకానిపక్షంలో… బాబుకు వదిలేయాలి!!

Read more RELATED
Recommended to you

Latest news