సినిమా ప్రియులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ధియేటర్ లో సినిమా రిలీజ్ అయ్యే రోజునే ఫైబర్ నెట్ లో చూసే సదుపాయం అందుబాటు లోకి తెచ్చామని.. ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది మా స్లోగన్ అని వెల్లడించారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి. APSFL కూడా ఒక ధియేటర్ లాంటిందని.. సబ్ సినిమా 24 గంటలపాటు అందుబాటులో ఉంటుందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు నగరానికి రాలేదు కాబట్టి ఈ ఆప్షన్ అని.. జూన్ 2 విశాఖ లో దీన్ని అధికారికంగా ప్రారంభిస్తామని ప్రకటన చేశారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి. OTT లో సినిమాలు వస్తున్న రోజుల్లో APSFL వల్ల ఆదాయానికి ఇబ్బంది ఉండదని.. నిరీక్షణ అనే సినిమాని మొదటిగా విడుదల చేస్తున్నామని వివరించారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి. 55 వేల కిలోమీటర్ల OFC వేయాలని టార్గెట్ అని.. 37 వేల OFC ని ఇప్పటి వరకు వేశామన్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి.