పలాస లో అమానుష ఘటన జరిగింది. అయితే నిజానిజాలు తెలుసుకోకుండా.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనవసర కామెంట్స్ చేసారు అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆడపిల్లల తల్లి… పరువు పోతుందని ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. చైల్డ్ రైట్స్ వారు వెలితే.. ఏం జరగలేదని.. ఆ పిల్లల తల్లి చెప్పింది కానీ నేను స్వయంగా ఆ తల్లికి ఫోన్ చేస్తే.. ఘటన జరిగింది అని చెప్పారు. విచారణ లో ఇష్టపూర్వకముగా వెళ్లారని తెలిసింది.
మైనర్లు కాబట్టి కేసు నమోదు చేయించాం. మాజీ పశువుల మంత్రి పశువు గానే ప్రవర్తిస్తుంది. నేను సెటిల్మేంట్ చేసానని అసత్య ప్రచారం చేస్తున్నారు. నిందితుల బందువులు.. మాతో ఫోటోలు తీసుకున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. నిందుతుల్ని అరెస్ట్ చేసాం. తల్లిని, చెల్లిని బైటకి గెంటిన మీరు..ఆడపిల్లల గురించి మాట్లాడతారా.. శిరీష ఇంట్లో సెటిల్మెంట్ జరగలేదని నిరూపిస్తే బొడిగుండు కోట్టించుకుంటారా.. ఎన్ని వేషాలు వేసినా.. అప్పలరాజు మాటలు నమ్మే వారు పలాస లో ఎవరూ లేరు అని గౌతు శిరీష పేర్కొన్నారు.