గుర్లలో డయేరియా వ్యాప్తికి కలుషిత నీరే కారణమ‌న్న నిపుణుల క‌మిటీ..!

-

గుర్లలో డయేరియా వ్యాప్తికి కలుషిత తాగు నీరే కారణం అని నిపుణుల క‌మిటీ తేల్చింది. విజయనగరం భౌగోళికంగా, పర్యావరణపరంగా ఇటువంటి వ్యాధి వ్యాప్తికి అనుకూలమని వెల్లడించింది. నమూనాల సత్వర పరీక్ష కోసం ప్రాంతీయ ప్ర‌యోగ‌శాల అవ‌స‌ర‌మ‌ని సిఫార‌సు చేసిన నిపుణుల క‌మిటీ.. సమగ్ర నివేదికను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమర్పించింది. నిపుణుల క‌మిటీ నివేదిక‌ను, గుర్ల అనుభ‌వాలపై త్వ‌ర‌లో చ‌ర్చించ‌నున్నారు ఆరోగ్య శాఖా మంత్రి.

ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా మంత్రిత్వ శాఖకు సమగ్ర నివేదిక అందించింది. ఇద్దరు జనరల్ మెడిసిన్ వైద్యులు, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ, పీడియాట్రిక్స్ నిపుణులు మరియు సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్‌లతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం.. రోగులు, వైద్యులు మరియు ఇతర వైద్య సిబ్బందితో విస్తృత చర్చలు జరిపారు. తాగునీరు విస్తృతంగా కలుషితం కావడమే ఈ ప్రాంతంలో డయేరియా వ్యాధి తీవ్రస్థాయిలో ప్రబలిందని‌తేల్చిన కమిటీ.. ర్యాపిడ్ రెస్పాన్స్ టీం గుర్ల నుండి సేకరించిన 44 నీటి నమూనాలలో 31 న‌మూనాల్లో కోలిఫారమ్‌లు ఉన్నట్లు నిర్ధారించింది. ఈ తాగునీరు ఉప‌యోగం కాద‌ని నిర్ధారించింది. 57 నమూనాల పరీక్షా ఫ‌లితాల ఆధారంగా భూత‌ల‌, భూగ‌ర్భ జ‌లాలు క‌లుషిత‌మైన‌ట్లు తేల్చి చెప్పింది కమిటీ.

Read more RELATED
Recommended to you

Latest news