తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల భారీ వర్షాల వలన వరదలు కూడా వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే సగం నగరం నీట మునిగింది. ఇక ఏపీలో కూడా కొన్ని చోట్ల పరిస్థితి అలానే ఉంది. అయితే విజయవాడ గ్రాండ్ ట్రంక్ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది.
చెన్నై వెళుతున్న కార్ల లోడు వ్యాగన్ పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. చుండూరు – నిడుబ్రోలు స్టేషన్ల మధ్య రైలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలు ఆలస్యం అయ్యాయి. డౌన్ లైన్ లోకి రైళ్లను మళ్ళిస్తుండటంతో రాకపోకలు అన్నీ ఆలస్యం కానున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రైలు మార్గాన్ని రైల్వే సిబ్బంది పునరుద్దరిస్తున్నారు. ఇక ఈ రైలు మార్గాన్ని సరిచేసే వరకూ ఆ మార్గంలో రైళ్లు తిరిగే అవకాశం లేదు.