అంతర్వేది ఘటన పై సీబీఐ దర్యాప్తు.. పవన్ కీలక ప్రకటన !

-

అంతర్వేది సంఘటనలో సీబీఐ దర్యాప్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరటం అంటే పరిష్కారం అయినట్టు కాదు, నిందితుల్ని పట్టుకోవటానికి వేసిన తొలి అడుగు మాత్రమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోందన్న ఆయన అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సిబిఐ పరిమితం కారాదన్న ఆయన పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సిబిఐ నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయని కాబట్టి పిఠాపురం, కొండ బిట్రగుంటల్లోని ఘటనల్నీ సిబిఐ పరిధిలోకి తీసుకువెళ్ళండని ఆయన డిమాండ్ చేశారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయని ఈ ఆలయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు ఆన్యులపరమైపోయాయని అన్నారు. వీటి గురించీ సిబిఐ ఆరా తీసి ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలని కోరారు. వీటితోపాటు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సిబిఐ ఆరా తీయాలని ఆ పింక్ డైమండ్ ఏమైపోయినదనే అంశంపై శ్రీ రమణ దీక్షితులు గారు గత ప్రభుత్వ హయాంలోనే సంచలన విషయాలు చెప్పారని పవన్ పేర్కొన్నారు. ఆ వజ్రం ఎటుపోయిందో ఆరా తీయాలని అలానే తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించీ ఆరా తీయాలని కోరారు. ఇక సీబీఐ ఎంక్వైరీ నేపధ్యంలో ఈరోజు పిలుపునిచ్చిన ‘ఛలో అంతర్వేది’ కార్యక్రమాన్ని విరమించుకుంటున్నామని, కానీ ధర్మ సంస్థాపనార్ధం తలపెట్టిన మహిళల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని పవన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news