పవన్ కల్యాణ్ అంటే నాకు గౌరవం ఉంది. ఆయన మంచి నటుడు. కానీ, రాజకీయాలకు పనికొచ్చే మనిషి
కాదు. పవన్ ఇప్పుడు లేకుండా మాట్లాడుతున్నారు. పిచ్చి, పిచ్చి సినిమా డైలాగులు కొడుతున్నారు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానన్న పవన్. ఇప్పుడు తనను ప్రశ్నించొద్దంటున్నాడు. పవన్ ఎవరిని బెదిరిస్తున్నాడు? పవన్ చీప్ బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నాడు. పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే. పవన్ ని నమ్ముకున్న అమాయకుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.
పవన్ కి అసలు పార్టీ నడపడం రాదు. చంద్రబాబుని జైల్లో పెడితే బాధేసిందని పవన్ విలపించారు. మరి వంగవీటి రాధను హత్య చేసినప్పుడు పవన్‌కు బాధ కలగలేదా?.. ముద్రగడను వేధించినప్పుడు బాధ కలగలేదా? అని అంబటి ప్రశ్నించారు. కాపు సోదరులంతా పవన్ గురించి ఆలోచించుకోవాలి. పవన్ షేరింగ్ గురించి మాట్లాడతారేమోనని అంతా ఎదురుచూశారు. పవర్ స్టార్ అన్నారు కానీ.. పవర్ షేరింగ్ గురించే మాట్లాడలేదు. సీఎం జగన్ ను దూషించడం కోసమే జెండా సభ జరిగినట్లుందన్నారు.