Pawan kalyan: ఈ ఫైళ్లపైనే పవన్ కళ్యాణ్ మొదటి సంతకం…

-

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ CMగా బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, RWS, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెండు ఫైల్స్ పై పవన్ సంతకం చేశారు.

Pawan Kalyan took charge as Deputy CM

ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించి నిధులు మంజూరుపై తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు. కాగా, విజయవాడ నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్ లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసు ఉంది. దీంతో ఆ ఆఫీసు ముందు ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్…. గౌ|| ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి&గ్రామీణ నీటిసరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రివర్యులు అని నేమ్ బోర్డుపై రాసి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news