జగన్ నోట రావాల్సిన మాట… పవన్ నోట్లో నుంచి వచ్చింది!

-

ఒకపక్క కరోనా కష్టాలు.. మరో పక్క సంక్షేమ పథకాల అమలు.. ఇంకో పక్క రోజు రోజుకీ పెరిగిపోతున్న ఆర్థిక భారం… ఈ పరిస్థితుల్లో కూడా జగన్ ఎంతో చాకచక్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఒక పక్క అర్ధం పర్ధం లేని ఆరోపణలు.. మరోపక్క లాజిక్కులు లేని నిందలు.. ఇంకోపక్క రెచ్చగొట్టే వ్యాఖ్యలు… అయినా కూడా వైకాపా నేతలు తమపని తాము చేసుకుంటూపోతున్నారు! వచ్చే విమర్శలు రానీ పోనీ అంటూ తాము అనుకున్న పనులు, అధినేత ఇచ్చిన బాధ్యతలు చేసుకుంటూ ముందుకుపోతున్నారు. ఈ సమయంలో నలువైపుల నుంచీ ఖాళీగా ఉన్న కొందరు నాయకుల నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. అర్ధం పర్ధం లేని ఆరోపణలు. కుర్చుంటే.. అదిగో కరోనా టైంలో ప్రజలను గాలికి వదిలేసి కూర్చున్నారని… నిలబడితే.. కరోనా టైంలో కూర్చోకుండా నిలబడటం ఏమిటని… ఈ స్థాయిలో ప్రతిపక్షాల విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు వైకాపా నాయకులకు తమ బాధ్యతలు గుర్తెరగడం, సేవాదృక్పథంతో పనిచేయడమే కాకుండా… ఇంకొకటి ప్రత్యేకంగా కావాలి… అదేమిటంటే… వాళ్ల నాయకుడికి పుష్కలంగా ఉన్న “సంయమనం”!

ఈ విషయం యాక్ట్యువల్ గా అయితే జగన్ తన ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు చెప్పాల్సిన విషయం! కానీ… రొటీన్ కు భిన్నంగా పవన్ కల్యాణ్ తన కార్యకర్తలకు చెబుతున్నారు! పవన్ కల్యాణ్, ఆయన మిత్రులు అయినా బీజేపీ – టీడీపీ లు రోజూ వైకాపా పై చేస్తున్న పనే ఇది అయినా కూడా… సంక్షోభ సమయంలో ప్రజలకు సాయం చేస్తున్న మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టినా సంయమనం కోల్పోవద్దని జనసేన కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు పవన్. కొంతమంది కరోనా వేళ తలెత్తే సమస్యలను పక్కదోవ పట్టించి, జనం దృష్టి మరల్చేందుకు వివాదాలు సృష్టిస్తుంటారన్న విషయం అంతా గ్రహించాలని చెప్పుకొస్తున్నారు.

సరిగ్గా గమనిస్తే… ఇది రోజూ టీడీపీ – బీజేపీ – జనసేన నేతలు చేస్తున్న పనే! సాయం చేస్తున్న వైకాపా నేతలను రెచ్చగొట్టడం… కరోనా వేళ తలెత్తే సమస్యలను పక్కదోవ పట్టించి, జనం దృష్టి మరల్చాలని వివాదాలు సృష్టించడం… కరోనా విషయాలు పక్కన పెట్టి కొసరు విషయాలతో కక్కుర్తి రాజకీయాలు చేయడం! అదేమిటో కానీ… పవన్ తాజాగా తన కార్యకర్తలకు ఇచ్చిన సూచనలు విన్నవారు మాత్రం… ఈ సూచనలు నిజంగా చేయాల్సి వస్తే… జగన్ తన కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చేయాలని అంటున్నారు. ఇదే సమయంలో పవన్ తన కార్యకర్తలకు ఇచ్చిన సూచనలు అన్నీ… ముందుగా వైకాపా విషయంలో పవన్ తో పాటు టీడీపీ – బీజేపీలు పాటిస్తే చాలని అంటున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news