సీఎం జగన్ నొక్కని బటన్లు ఇవే : పవన్ కళ్యాణ్‌ సెటైర్లు

-

సీఎం జగన్ నొక్కని బటన్లు ఇవే అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్‌ సెటైర్లు విసిరారు.  బటన్ నొక్కితే డబ్బులు పడుతున్నాయని CM జగన్ అంటున్నారని, ఆయన నొక్కని బటన్లు చాలా ఉన్నాయని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.

‘పూర్తికాని పోలవరం…రాని ఉద్యోగ నోటిఫికేషన్…రైతులకు అందని పంట నష్టపరిహారం…కొబ్బరి సాగుకు రాని మద్దతు ధర…మూతపడిన ఎనిమిది వేల బడులు…తాగునీరు దొరకని గ్రామాలు…ఆగిన అంబేడ్కర్ విదేశీ విద్యా సాయం…అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్…నువ్వు నొక్కని బటన్’ అని మండిపడ్డారు. అలాగే, టాలీవుడ్ హీరోల అభిమానుల ఓట్లు సైతం చీలిపోకుండా చేయడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నారు. తనకు అందరూ హీరోలు ఇష్టమే అని, అయిట్స్ సినిమాలు వేరు రాజకీయం వేరు గాని..సినిమాలకు వచ్చేసరికి ఏ హీరో అభిమాని..ఆ హీరో సినిమాని ఆదరించవచ్చు అని, కానీ రాజకీయాలకు వచ్చేసరికి అంతా ఏకం కావాలని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news