వారాహిని లోపల ఎందుకు పెట్టారో పవన్ సమాధానం చెప్పాలి – మంత్రి చెల్లుబోయిన

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. చంద్రబాబు కోసమే తాను పనిచేస్తున్నాననే విషయాన్ని పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో చేసిన వ్యాఖ్యలతో మరోసారి స్పష్టం చేశారని అన్నారు. దీనివల్ల ఎక్కువగా బాధపడేది జనసైనికులేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ మూసుగు తొలగిపోయిందని ఆరోపించారు.

తమకేదో న్యాయం చేస్తాడని అనుకొని జనసైనికులు పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇచ్చారని.. కానీ ఇప్పుడు ఏం చేయాలో వరకే తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. వారాహిని ఎందుకు లోపల పెట్టారో పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను జనం ఏమాత్రం నమ్మేస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. నారా లోకేష్ కోసమే పవన్ కళ్యాణ్ వారాహిని పక్కన పెట్టారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news