2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తాం – మంత్రి పెద్దిరెడ్డి

2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా లో 3వ విడత వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర లో వైఎస్ జగన్ కు అనేక మంది మహిళలు తమ కష్టాలు తెలిపారని..చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేశారని మహిళలు ఆవేదన చెందారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.


అందుకే సిఎం వైఎస్ జగన్ మహిళల కష్టాలను విని, నవ రత్నాలు లో వైఎస్సార్ ఆసరా ను పొందుపరిచారు… 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో మనం విజయం సాధించామన్నారు. రెండో మూడో ఎమ్మెల్సీలు గెలవగానే అధికారం లోకి వచ్చామని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారని.. గతంలో కంటే వైసిపికి మరిన్ని స్థానాలు అధికంగా వస్తాయి తప్ప, ఎక్కడా సీట్లు తగ్గవని వివరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీ అందరి మన్ననలు పొందుతున్న వ్యక్తి సిఎం శ్రీ వైఎస్ జగన్ అని.. గతంలో చంద్రబాబు లాగా రైతులను, మహిళలను మోసం చేయలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేసిన గొప్ప నాయకుడు సిఎం వైఎస్ జగన్ అని కొనియాడారు.