వేసవిలో విద్యుత్‌ కోతలు ఉండవు – మంత్రి పెద్దిరెడ్డి

-

వచ్చే వేసవిలో ఏపీ వ్యాప్తంగా విద్యుత్‌ కోతలు ఉండవని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర జీడీపీ పురోగమనానికి విద్యుత్ శాఖ కీలకమైందని.. విద్యుత్ శాఖ పై జరిగే వ్యతిరేక ప్రచారానికి కూడా విద్యుత్ శాఖ విద్యుత్ సరఫరా చేస్తోందని వెల్లడించారు. 9 గంటల ఉచిత విద్యుత్ , రాష్ట్ర అభివృద్ధి లో కీలకమైన ఆక్వా రంగానికి కూడా సబ్సిడీ పై విద్యుత్ ఇస్తున్నామని.. విద్యుత్ సబ్సిడీ ల కోసం 65 వేల కోట్లు వెచిస్తున్నామని చెప్పారు.

3500 కోట్ల రూపాయల వ్యయంతో జగనన్న కాలనీ లకు విద్యుత్ ఇచ్చేందుకు రుణం తీసుకున్నామని.. విద్యుత్ సంస్థలు సాధించే అభివృద్దే విమర్శలకు సమాధానం చెప్పాలని వెల్లడించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇటీవల కృష్ణపట్నం లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని… పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ లీడ్ స్టేట్ గా ఉందన్నారు. ఉద్యోగుల కు అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని.. అన్ని శాఖలకు విద్యుత్ శాఖ అవసరం ఉంటుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news