వారిని ప్రజలు క్షమించరు.. పార్టీ మార్పుపై స్పందించిన రోజా!

-

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ చేరిన నేతలు ఒక్కొక్కరుగా ప్రస్తుతం అధికార పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తానూ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై నగరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, జగన్‌తోనే కలిసి నడుస్తానని క్లారిటీ ఇచ్చారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజలు క్షమించరని అన్నారు. శనివారం తిరుమలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..

Former Minister Roja’s tweet went viral on the occasion of YSR Jayanti

‘రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు. వారికి రక్షణ లేకుండా పోయిందని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.గుడ్లవల్లేరు కాలజీలో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరమని అన్నారు. బాత్ రూంలో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందిన వారిని కఠినంగా శిక్షించాలి’ అని రోజా డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా, వైసీపీ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు మోపీదేవి,బీద మస్తాన్, మరో ఇద్దరు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ గూటికి చేరిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news