గర్జించు.. గాండ్రించు.. హైడ్రా పై టీ కాంగ్రెస్ స్పెషల్ ట్వీట్..!

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హైడ్రా పేరు మారుమ్రోగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. చెరువులు, కుంటలు, నాళాలు, పార్కులు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రాపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

హైదరాబాద్ లో అమలు చేస్తున్న హైడ్రా తరహా వ్యవస్థ మాకూ కావాలంటూ జిల్లాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నట్టు సమాచారం.  మరో వైపు హైదరాబాద్ లో అక్రమంగా చెరువులు ఆక్రమించి నిర్మించిన కట్టడాలపైకి హైడ్రా బుల్డోజర్లు పరుగులు తీస్తున్నాయి. ఈ తరుణంలోనే  హైడ్రా పై టీ కాంగ్రెస్ స్పెషల్ ట్వీట్ చేసింది.. గర్జించు హైడ్రా.. గాండ్రించు హైడ్రా అంటూ 2 నిమిషాల నిడివి కలిగిన వీడియోను షేర్ చేసింది. సొంత కుటుంబం సైతం హైడ్రాకు అతీతం కాదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని ఈ వీడియోలో పేర్కొంది టీ కాంగ్రెస్.

Read more RELATED
Recommended to you

Latest news