ఆ తమిళ నేతను సెల్ ఫోనే కాపాడింది.. లేదంటే ?

ఎక్కడయినా సెల్ ఫోన్ ప్రాణాలు కాపాడుతుండా ? ఇదేం విడ్డూరం అనుకోండి, నిజమే మరి. కుప్పం సరిహద్దు వద్ద తమిళనాడు డిఎంకె నేత వేలాయుధంపై దుండగులు కాల్పులు జరిపారు. సరిగా ఆయన గుండెకు గురి పెట్టి కాల్పులు జరిపారు. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌ లో ఉండడంతో అయన పని ఇక అయిపోయినట్టేననుకున్నారు. కానీ గన్ పేలినా బుల్లెట్ దిగలేదు.

అదెలా అనుకుంటున్నారా..? అతడి చేబులో ఉన్న సెల్‌ ఫోన్‌ అతడి ప్రాణాలను కాపాడింది. బుల్లెట్ సెల్‌ఫోన్‌ కు తగిలి, శరీరంలోకి దూసుకెళ్లలేదు. కేవలం ఆ స్పీడకి ఆయనకే గాయాలు అయ్యాయి. దీంతో అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆయన్ని ఆస్పత్రికి తరలించి అందిస్తున్నారు. కాల్పుల తర్వాత నిందితులు కుప్పం వైపు పరారయ్యారని అంటున్నారు అక్కడి ప్రత్యక్ష సాక్షులు.