వివాహితపై కన్నేసిన బావా..పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి…

-

దేశంలో ప్రేమ పేరుతో ఎన్నో మోసాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే.. లైంగక దాడులు చేసి, హత్యలు కూడా చేస్తున్నారు కొంత మంది దుర్మార్గులు. సరిగ్గా ఇలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది.భర్తకు దూరంగా ఉంటున్న మహిళను ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతిని చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.జిల్లా కౌడిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(19) గతేడాదే ఓ వ్యక్తితో వివాహమైంది.అయితే మనస్పర్థల కారణంగా ఏడాదికే వారిద్దరూ విడిపోయారు.దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది.ఆమెకు సమీప బంధువు,బావ వరుసయ్యే నరసింహ అనే వ్యక్తి యువతికి ప్రేమ పేరుతొ దగ్గరయ్యాడు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. తరచూ ఆ యువతితో లైంగిక కోరికలు తీర్చుకోవడంతో ఆమె గర్భం దాల్చింది.దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని నరసింహ ను కోరగా..తనకేమీ సంబంధం లేదని ప్లేటు ఫిరాయించేశాడు.ఎవరెవరితోనో తిరిగి గర్భం తెచ్చుకొని, తనను ఇరికించాలని చూస్తున్నారా?అంటూ ఎదురు తిరిగాడు.దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు నరసింహా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news