రోజా ప్రోటోకాల్ ప్రాబ్లం… లేటెస్ట్ అప్ డేట్ ఇదే!

-

సాధారణంగా కూటమిలో ఏర్పడిన ప్రభుత్వాలలో ప్రోటోకాల్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. గతంలో టీడీపీ – బీజేపీ ల ఉమ్మడి ప్రభుత్వంలో ఈ సమస్యలు అక్కడక్కడా కనిపించేవి! కానీ… తాజాగా ఏర్పడిన వైకాపా ప్రభుత్వంలో కూడా ఒక ఎమ్మెల్యేకి – డిప్యుటీ సీఎం కి మధ్య ప్రోటోకాల్ సమస్య వచ్చిందని ఒక వర్గం మీడియాలో పెద్ద దుమారమే రేగింది! దీంతో.. రోజాతో ఎప్పుడూ సొంతపక్షంలో సమస్యలే అని టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాసుకుంటూ వచ్చింది. అయితే… ఈ విషయంలో అటు రోజా – ఇటు నారాయణ స్వామీ లు హుందాగా వ్యవహరించడంతో ఇది చాలా చిన్న విషయంగా సద్దుమణిగి పోయింది!

ఈ సమస్య ఏ కారణంతో అయితే వచ్చిందో… ఆ కల్యాణ మండప నిర్మాణానికి సహకరించాలంటూ ఎమ్మెల్యే రోజాకి అంబేద్కర్ ట్రస్ సభ్యులు వినతిపత్రం అందజేయగా ఆమె నవ్వుతూ స్వీకరించారు! దీంతో రోజా మనసులో ఎలాంటి కోపతాపాలూ లేవని అర్ధం అయినట్లేనని అంటున్నారు స్థానిక నేతలు! అనంతరం స్పందించిన ఎమ్మెల్యే రోజా “వాళ్లను వెళ్లవద్దని నేను చెప్పడం లేదు.. ఎస్సీల కోసం కల్యాణమండం కట్టడం నాకు కూడా హ్యాపీయే కదా.. కాకపోతే నన్ను కూడా పిలిస్తే గౌరవంగా ఫీలవుతా కదా!” అని హుందాగా స్పందించారు!

అనంతరం ఈ వ్యవహారంపై డిప్యుటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. “ఈ వ్యవహారంలో దురుద్దేశం ఏమీ లేదు.. కలెక్టర్‌ పుత్తూరు మీదుగా తిరుపతి వెళ్తుంటే తీసుకెళ్లి స్థలాలు చూపించాం తప్ప ఇందులో మరో ఉద్దేశ్యం ఏమీ లేదు… రోజాకు నాకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాల్లేవ్.. కల్యాణ మండపం విషయాలన్నీ ఎమ్మెల్యే రోజా సోదరుడికి కూడా చెప్పాను” అని తెలిపారు! ఇలా ఇద్దరు నేతలు పనికిమాలిన ఈగోలకు పోకుండా ఇంత హుందాగా స్పందించేసరికి… ఈ వ్యవహారం మరింత హుందాగా సద్దుమణిగినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news