చంద్రబాబుని ఇరకాటంలో పాడేసిన ఆర్.ఆర్.ఆర్. కొత్త కామెంట్!!

-

ప్రస్తుతం బాబు అనుకూల మీడియా మోస్తున్న.. బాబుకు అనుకూలుడు అని పేరు సంపాదించుకున్నారని నెటిజన్లు కోడై కూస్తున్న నరసాపురం వైఎస్సార్సీపీ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్) ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా మైకులముందుకొచ్చి చంద్రబాబును ఇరికించేశారు! ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. మాటలు బాబుకు నిద్రపట్టకుండా చేస్తున్నాయనే కామెంట్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి!

అవును… జగన్ ను ఏదో ఇరకాటంలో పెట్టాలనే కుతుహలంతో ప్రతిరోజూ మైకులముందుకు వస్తున్న ఆర్.ఆర్.ఆర్… ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సూచిస్తున్నారు. అంతేనా… కరోనా వల్ల పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయన్న మాటలు వాస్తవాలే అయినప్పటికీ… జగన్‌ ఎంతగానో అభిమానించే కేసీఆర్‌ ఎమ్మెల్సీ, జీ.హెచ్‌.ఎం.సీ ఎన్నికలు జరుపుతున్నట్లుగా ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సూచిస్తున్నారు ఆర్.ఆర్.ఆర్.!

ఈ కామెంట్ వల్ల జగన్ ను ఆర్.ఆర్.ఆర్. ఎంతగా ఇబ్బందిపెట్టానని ఫీలవుతున్నారో తెలియదు కానీ… బాబును మాత్రం ఇరకాటంలో పెట్టారు. ఆర్.ఆర్.ఆర్. చేసే ప్రతీ కామెంట్ కు చప్పట్లు కొట్టే టీడీపీ నేతలు… ఈ కామెంట్ విషయంలో మాత్రం పల్లు పటపటా నూరేస్తున్నారంట! ఇప్పుడు ఏపీలో టీడీపీ ఉన్న పరిస్థితికి.. అసలు ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి ఉంటుందా? బాబు భాగ్యనగరంలో సేదతీరడం మొదలుపెట్టి అర్ధ సంవత్సరం దాటేసిన ఈ పరిస్థితుల్లో ఎన్నికలా?

స్థానికంగా కార్యకర్తలు, నేతలు ఎవరు పార్టీలో ఉన్నారో, ఎవరు జంపయ్యారు తెలుసుకోవడానికి టీడీపీ నేతలకు ఆరునెలలు పడుతుంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి! దీంతో.. ఈ ఎన్నికలు ఉండకూడదనే కదా… నిమ్మగడ్డ ను ఆ రేంజ్ లో వాడుకుంది, మళ్లీ ఆర్.ఆర్.ఆర్. వచ్చి ఇలాంటి కబుర్లు చెబుతున్నారేంటంటూ తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారంట!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news