వాలంటీర్లను శాశ్వతంగా తప్పించాలి..ఎన్నికల సంఘానికి రఘురామ లేఖ

-

వాలంటీర్లను శాశ్వతంగా తప్పించాలని… కేంద్ర ఎన్నికల సంఘానికి రఘురామ లేఖ రాశారు. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రెవిన్యూ అధికారుల సహకారంతో వాలంటీర్లు దొంగ ఓట్ల నమోదు ప్రక్రియకు తెరలేపారని, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ గారికి వివరిస్తూ తాను ఒక లేఖ రాశానని వెల్లడించారు రఘురామ. దొంగ ఓట్ల నమోదు ప్రక్రియకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని, లేకపోతే ఏముందిలే ఎవరు మనని పట్టించుకుంటారులే అనే ధీమాతో మన దారిన మనం చేసుకో పోదామని అధికారులు పదే పదే తప్పులు చేస్తారని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.

నాలుగు కోట్ల ఓట్లలో రెండు, మూడు లక్షలు ఓట్లు గల్లంతు కావడం సర్వసాధారణమేనని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పేర్కొన్నట్లుగా సాక్షి దినపత్రిక వక్రీకరణ కథనాలు రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లకు సంబంధమే లేదని, ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా రోజు వారి వేతనంతో కొంత మంది సిబ్బందిని ఎన్నికల సంఘం అధికారులు నియమించుకుంటారని, రోజువారి వేతనంపై పని చేసే వారిని ప్రభావితం చేసి, అధికారుల సహకారంతో దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం ద్వారా వాలంటీర్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు.

ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తంగా ఉండాలని, విదేశాలలో నివసించే వారి పేరిట కూడా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, అలాగే ఎవరైతే గ్రామాలలో నివసించడం లేదో వారి ఇంటి చిరునామా పేరిట దొంగ ఓట్లు నమోదు చేయడమన్నది ఆనవాయితీగా మారిందని, తన నియోజకవర్గ పరిధిలోని తణుకులో రెండు బూతుల పరిధిలోని 100 ఇండ్లలో 200 నుంచి 300 దొంగ ఓట్లను నమోదు చేశారని, ప్రతి నియోజకవర్గంలో ఏడు నుంచి పదివేలకు తగ్గకుండా దొంగ ఓట్లను నమోదు చేయడమే కాకుండా, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని రఘురామకృష్ణ రాజు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news