వైసీపీని తరిమికొట్టేందుకు..అన్ని పార్టీలు కలిస్తాయి – RRR

-

వైకాపా ముఖ్త ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి పని చేయడం ఖాయమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. పొత్తులపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టతనిచ్చారని, ప్రతిపక్షాల ఓట్లు చీల నివ్వనని పేర్కొన్న ఆయన, సరైన సమయంలో పొత్తులపై నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారని గుర్తు చేశారు. తాజాగా నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో జరిగిన సమావేశంలో ఏమి మాట్లాడారోనన్న టెన్షన్ అటు జనసేన ఇటు టీడీపీ కార్యకర్తలలో కనిపించిందని, వారి కంటే ఎక్కువ టెన్షన్ తమ పార్టీ నాయకత్వంలో కనిపించిందన్నారు.

టీడీపీతో పొత్తు గురించి బీజేపీ పెద్దలతో మాట్లాడారా? అని పవన్ కళ్యాణ్ గారిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు, రాజకీయాలంటే అన్ని మాట్లాడుకుంటామని ఆయన సమాధానమిచ్చిన తీరు తోనే పొత్తులపై విస్పష్టమైన సమాధానం ఇచ్చినట్లయిందని అన్నారు. పొత్తులపై జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చిన తరువాత కూడా ఇంకా పొత్తుల గురించి ఎవరికైనా అర్థం కాలేదంటే వారు బుద్ధిహీనులై ఉంటారని అన్నారు.

 

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 40% ఓటు బ్యాంకు గతంలోనే ఉన్నదని, ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ గారు పేర్కొనడం ద్వారా టీడీపీతో కలిసి వెళ్లాలని నిర్ణయించినట్లుగా తేటతెల్లము అవుతుందని, ఎన్నికల్లో ఒంటరిగా వెళితే, ఈ దుష్ట పాలనను అంతం చేయలేమని, ఈ దుష్టపాలను అంతం చేయాలి అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోరాడాలని ఆయన భావిస్తున్నట్లుగా స్పష్టం అవుతోందని అన్నారు. ఒక పార్టీ అధినేతగా తనకున్న ఓటు బ్యాంకు ఎంతో ఆయన స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారని, రాష్ట్రాన్ని ఈ దుష్ట పాలన నుంచి విముక్తి చేయాలని పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టు కున్నారని, రాష్ట్రంలో బీజేపీ ఎంతగా పెరిగినప్పటికీ, టీడీపీ జనసేనతో కలిసి వెళ్తేనే ఈ దుష్ట ప్రభుత్వాన్ని తుద ముట్టించడమన్నది సాధ్యం అవుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news