‘బలగం’ సినిమాకు అవార్డుల పంట.. వేణు ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం

-

బలగం.. ఇప్పుుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఈ పేరే వినిపిస్తోంది. ఇద్దరు సినిమా లవర్స్ ఒకచోట కలిస్తే ఈ చిత్రం గురించి మాట్లాడుకోకుండా ఉండటం లేదు. చిన్న సినిమాగా విడుదలై.. అటు కలెక్షన్స్​లో ఇటు అవార్డుల పంట పండిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. కంటెంట్​లో సరైన ఎమోషన్ ఉండి.. ప్రేక్షకుడిని కనెక్ట్ చేసే పాయింట్ ఉంటే.. మూవీ చిన్నదైనా పెద్దదైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా బలగం.

బలగం సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా తాజాగా అరౌండ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ – ఆమ్‌స్టర్‌డామ్‌ కార్యక్రమంలో మరో అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడి విభాగంలో వేణు దీనిని అందుకున్నారు. యూకే, యూఎస్‌, చైనా.. ఇలా పలు దేశాలకు చెందిన చిత్రాలు, దర్శకులను వెనక్కి నెట్టి వేణు ఈ అవార్డును అందుకోవడంపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వచ్చిన అవార్డుతో ‘బలగం’ ఖాతాలో ఏకంగా తొమ్మిది అవార్డులు చేరాయని దర్శకుడు వేణు పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news