వివేకానంద హత్య వెనుక గాడ్ ఫాదర్ – రఘురామరాజు

-

మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యకు పథక రచన చేసిన సూత్రధారులు ఎవరో తేలిపోయిందని, ఇక ఈ హత్య వెనుక అల్టిమేట్ సూత్రధారులు ఎవరైనా ఉన్నారా లేదా అన్నది తేలాల్సి ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. హత్యకు పథక రచన చేసిన వారికి పెద్ద మొత్తం సొమ్మును ఏర్పాటు చేస్తామని ఎవరైనా గాడ్ ఫాదర్ చెప్పారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. హత్య చేసిన వారు ముందే దొరికారని, ఇప్పుడు లెవెల్ వన్ సూత్రధారుల పేర్లు బయటకు వచ్చాయని అన్నారు.

గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారికి, ప్రకాష్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ప్రణాళిక రచించగా, ఆ పథకాన్ని మరో నలుగురు అమలు చేశారని హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన సునీల్ యాదవ్ బెయిల్ అభ్యంతర పిటిషన్ లో పేర్కొందన్నారు. ఈ విషయాన్ని కొన్ని పత్రికలు స్పష్టంగా రాశాయని కానీ సాక్షి దినపత్రిక దీనిపై కనీసం ఒక్క లైను కూడా రాయలేదన్న ఆయన, సాక్షి దిన పత్రికలో రాయనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదని అన్నారు. పులివెందులలో ఈనాడు, ఆంధ్ర జ్యోతి దినపత్రిక ప్రతులను దగ్ధం చేసినంత మాత్రాన ప్రయోజనం ఏముంది అని ప్రశ్నించారు. సాక్షి దినపత్రికలో రాయకపోతే ఇతర దినపత్రికల్లో రాయవద్దా అంటూ ప్రశ్నించారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యకు సూత్రధారులు గురించి రాసినప్పుడు పులివెందులలో పత్రికా ప్రతులు దగ్ధం చేసిన వారు, ఆయన హత్య గావించబడినప్పుడు ఎటువంటి ఘర్షణలకు దిగలేదని గుర్తు చేశారు. దీన్నిబట్టే ఈ హత్య వెనుక ఎవరున్నారో స్పష్టమవుతుందని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.

 

వై.యస్. వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడిన మార్చి 14వ తేదీ అర్ధరాత్రికి కొన్ని గంటల ముందు వై.యస్. భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో శివ శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వై.యస్. అవినాష్ రెడ్డి గారు సమావేశమయ్యారని, కానీ ఎర్ర గంగిరెడ్డి మాత్రం వివేకానంద రెడ్డి గారితో స్నేహాన్ని నటిస్తూ ఆయన వెంటే ఉన్నారని అన్నారు. వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడానికి అనంతపురం జిల్లా కదిరిలో గొడ్డలిని కొనుగోలు చేశారని, గొడ్డలిని విక్రయించిన వ్యక్తి తాను దస్తగిరికి అమ్మానని ఆ తర్వాత సీబీఐ అధికారుల విచారణలో వెల్లడించారని గుర్తు చేశారు. దస్తగిరి, సునీల్ యాదవ్ ఇద్దరు కలిసి ఓచోట మద్యం సేవించి, ఎర్ర గంగిరెడ్డి సూచనల మేరకు వెనుక డోర్ నుంచి వై.యస్. వివేకానంద రెడ్డి గారి ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు. అప్పటికీ వివేకానంద రెడ్డి గారు వీళ్లు ఎందుకు వచ్చారని గంగిరెడ్డిని ప్రశ్నించగా… ఏదో లావాదేవీల కోసం తన దగ్గరకు వచ్చారని పేర్కొని ఆయన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. వివేకానంద రెడ్డి గారి ఇంట్లోకి ప్రవేశించిన దస్తగిరి, సునీల్ యాదవ్ లు తొలుత ఆయన చేతిపై దాడి చేసి, ఆ తరువాత తలపై వేటు వేశారన్నారు. వివేకానంద రెడ్డి గారు నిద్రకు ఉపక్రమించగానే దిండుతో ముఖంపై అదిమి హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించాలన్న ఐడియా ఫెయిల్ అవడంతో, గొడ్డలితో ఆయనపై దాడి చేసినట్లు విచారణలో దస్తగిరి అంగీకరించిన విషయం తెలిసిందేనని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. తుది శ్వాసతో ఉన్న వివేకానంద రెడ్డి గారిని ప్రాణాలతో వదిలివేస్తామని చెప్పి, ఆయనతో బలవంతంగా ఒక లేఖ రాయించారని, అందులో ఊరులో లేని ప్రసాద్ ను వదిలి పెట్టవద్దని ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక హత్యను దారి మళ్లించే కుట్ర దాగి ఉందన్నారు. హత్య జరిగిన విధానాన్ని ఆరోజు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ మోహన్ రెడ్డి గారికి సూత్రధారులు పూసకొచ్చినట్లు వివరించారని తెలిపారు. సీబీఐ కథనం ప్రకారం హత్య జరిగిన రోజు ఉమా శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లినట్లు స్పష్టంగా సీసీ ఫుటేజ్ లో కనిపించినట్లు తెలియజేశారని అన్నారు. గూగుల్ లుక్ అవుట్ లో ఎవరెవరి ఫోన్లు ఒకే సమయంలో ఒకే టవర్ రేంజ్ లో ఉన్నాయో సీబీఐ అధికారులు తమ విచారణలో తేల్చారని అన్నారు. వివేకానంద రెడ్డి గారి ఇంట్లో రక్తపు మరకలను తుడిచే కార్యక్రమాన్ని పెద్దలు చూసుకుంటామని హామీ ఇచ్చారని, ఎర్ర గంగిరెడ్డి హంతకులకు సమాచారం ఇచ్చారన8 అన్నారు. వివేకానంద రెడ్డి గారి పీఏ కృష్ణా రెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సమాచారం అందించగా, వివేకానంద రెడ్డి గారు బావ మరిది హత్య జరిగిన విషయాన్ని వై.యస్. అవినాష్ రెడ్డి గారికి ఫోన్ ద్వారా తెలియజేయడంతో, తనకు ఫోన్లో సమాచారం అందిన వెంటనే అవినాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సతీమణి అటెండర్ నవీన్ కు ఫోన్ చేసి ఆ ఫోన్ ద్వారా భారతి రెడ్డి గారితో ఆరు నిమిషాల పాటు చర్చించారని అన్నారు. జమ్మలమడుగుకు వెళ్లే దారిలో ఉన్న తాను వై.యస్. వివేకానంద రెడ్డి గారి ఇంటికి చేరుకున్నానని అవినాష్ రెడ్డి గారు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉదయం 6 గంటల 27 నిమిషాలకు వివేకానంద రెడ్డి గారి బావ మరిది అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేయగా, జమ్మలమడుగుకు వెళ్లే దారిలో ఉన్న అవినాష్ రెడ్డి గారు రెండు నిమిషాల వ్యవధిలో వివేకానంద రెడ్డి గారి ఇంటికి ఎలా చేరుకున్నారని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి గారి ఇంటికి చేరుకున్న అవినాష్ రెడ్డి గారు సీఐ శంకరయ్యకు ఫోన్ చేసి ఓ నలుగురు సిబ్బందిని పంపించాలని కోరారని తెలిపారు. ఆ తర్వాత గుండెపోటుతో రక్తపు వాంతులు చేసుకొని వివేకానంద రెడ్డి గారు మృతి చెందినట్లు అవినాష్ రెడ్డి గారు పేర్కొనడం ముందుగా రచించిన ప్రణాళికలో ఒక భాగమని తెలిపారు. అప్పటి వరకు గుండెపోటు థియరీని చెప్పినా, రక్తపు మడుగులో ఉన్న వివేకానంద రెడ్డి గారి ఫోటో బయటికి రావడంతో నర్రెడ్డి సునీత గారు పోస్టు మార్టం చేయాలని కోరడం జరిగిందన్నారు. సాక్షిలోనూ తమ పార్టీ నాయకులు కొంత మంది ముందుగా వివేకానంద రెడ్డి గారు రాసిన లేఖను ఎందుకు బయట పెట్టలేదంటూ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారిలలో ఒకరి ఆదేశాల మేరకు తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు సైతం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news