ఏప్రిల్, మే మాసాలలో విశాఖకు తన మకాం మారుస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట మార్చి సెప్టెంబర్ లో విశాఖకు మకాం మారుస్తానని పేర్కొనడం విస్మయాన్ని కలిగించిందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.
సుప్రీంకోర్టులో రాజధాని కేసుపై తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారా?, రాజధాని అమరావతి అయినప్పటికీ మూటముల్లే సర్దుకొని విశాఖపట్నం మకాం మారుస్తారా? అన్నది ఆయన చెప్పడం లేదని, కోర్టులో రాజధాని కేసు పెండింగ్ లో ఉండగానే విశాఖకు మకాం మారుస్తానని ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. కోర్టు తీర్పు ఏదైనాప్పటికీ, విశాఖపట్నంకు మకాం మారిస్తే మార్చండి అంతేకానీ ఇలా ప్రజలను భయపెట్టడం ఎందుకు? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.