బాబాయిని వేసినంత ఈజీ కాదు.. నన్ను చంపడం – రఘురామ

-

తన నియోజకవర్గంలో తనని, తన ప్రజలతో కొట్టించడం అంటే బాబాయిని హత్య చేసినంత సులవు కాదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. తన నియోజకవర్గంలోకి అడుగుపెడితే తనని జనాలు కొడతారని ఒక మూర్ఖుడు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన నియోజకవర్గానికి వస్తుంటే, తనని రానివ్వకుండా అడ్డుకొన్న మీరు మగాల్లా లేక మూడో రకం వాళ్లా అనే అనుమానం కలుగుతుందని, తనపై నియోజకవర్గంలో దాడి చేయించేందుకు బాబాయిని హత్య చేయించడానికి తీసుకువచ్చినట్లు, ఇతర ప్రాంతం నుంచి ఎవరినైనా తీసుకువస్తే నియోజకవర్గ ప్రజలే కైమా చేస్తారు జాగ్రత్త అని, ఇక మీ దాష్టికాలకు రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు.

 

రాష్ట్ర జిడీపీ 12 లక్షల కోట్ల రూపాయలుగా ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని, ఎఫ్ ఆర్ బి ఎం చట్టం ప్రకారం రాష్ట్ర జిడిపిలో 20 శాతానికి మించి అప్పులు చేయకూడదని, కార్పొరేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని కాగ్ చెప్పిందని అన్నారు. కార్పొరేషన్ పేరిట అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చూపించడం లేదని కాగ్ నే పేర్కొందని, కార్పొరేషన్ల పేరిట 1.15 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు సమాచారం ఉందని, కార్పొరేషన్ అప్పులు వెలుగులోకి రాకుండా మేనేజ్ చేస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news