ఆ పార్టీలోనే చేరబోతున్నా – రఘురామకృష్ణ రాజు

-

తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమిలో జనసేనతో పొత్తు కలిగి ఉన్న బీజేపీ కూడా భాగస్వామిగా చేరే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణ రాజు గారు పునరుద్ఘాటించారు. అలా భావించకపోతే రాజకీయంగా బుద్ధిహీనులే అవుతారని, ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానాన్ని కోరుకునే పార్టీలో చేరుతానని రఘురామకృష్ణ రాజు గారు స్పష్టం చేశారు. ఫిబ్రవరి రెండవ వారాంతంలోగా వైకాపాకు రాజీనామా చేస్తానని వెల్లడించిన ఆయన ఒక రాజీనామా మరొక ఎన్నికకు మార్గం సుగమం చేస్తుందని చెప్పారు.

రానున్న ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలియజేశారు. గత నాలుగేళ్లుగా తనపై ఎన్నో అక్రమ కేసులను నమోదు చేశారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. తనపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలియజేయాలని న్యాయస్థానాన్ని కోరానని, తనపై 16 నుంచి 17 కేసులు ఉన్నట్టు లెక్క చెప్పారని, అన్నింటిలోనూ న్యాయస్థానం వద్ద నుంచి స్టే పొందానని, లేదంటే అప్పీల్ కు వెళ్లడం చేశానని తెలిపారు. తనపై రాజ ద్రోహం కేసు నమోదు చేశారని, వీడో రాజు… నేను ద్రోహం చేశాను అని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news