అల్పపీడనం ఎఫెక్ట్.. ఇవాళ, రేపు ఏపీలో భారీ వర్షాలు

-

ఏపీలో ఇవాళ రేపు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రేపటికి బలపడి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అనంతరం ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈనెల 22న ఉదయానికి వాయుగుండం గా మారుతుందని ఆ తర్వాత మరింతగా బలపడి తుఫానుగా రూపాంతరం చెందుతుందని అధికారులు తెలిపారు.

దీని ప్రభావం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక ముఖ్యంగా కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో జాలర్లు అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news