జగన్ కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రాజీనామా చేశారు. వైసీపీ పార్టీ లో పరిణామాలపై విశాఖజిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అసంతృప్తితో ఉంటున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. తాజాగా వైసీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు పంచకర్ల రమేష్ బాబు.
అధ్యక్షుడుగా ఎవరికైనా పదవుల్లో న్యాయం జరగకపోతే క్షమాపణ కోరుతున్నానని వివరించారు. వైసీపీ హైకమాండ్ ఆహ్వానం మేరకే నేను అధికార పార్టీలో చేరానని ఈ సందర్భంగా రమేష్ బాబు పేర్కొన్నారు. అయితే.. హై కమాండ్ ను ఒప్పించలేనందుకు క్షమించండని… చాలా ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఉద్వేగానికి లోనైన పంచకర్ల రమేష్ బాబు…తాను వైసీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. భవిష్యత్ ప్రణాళిక చేసుకుని రాజీనామా చేయలేదని…ముఖ్య నాయకత్వం తో చర్చించుకుని భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని వివరించారు.