టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళతానని ప్రకటించిన నేపథ్యంలో ఆయనను అడ్డుకునేందుకు రేవంత్ ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.
హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకుని ఆయన ఇంటికి వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసుల అరెస్టులతో ముందస్తు అరెస్టులతో టెన్షన్ వాతావరణం నెలకొంది.