వైస్సార్సీపీ తిరుగుబాటు నేత, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి నేడు టీడీపీలో చేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఇవాళ మధ్యాహ్నం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారు. ఈ సందర్భంగా నెల్లూరు నుంచి గిరిధర్‌రెడ్డి భారీ ర్యాలీగా మంగళగిరికి బయల్దేరారు.
నెల్లూరు నుంచి దాదాపు 300 కార్లతో కోటంరెడ్డి అనుచరులు ఈ ర్యాలీని ప్రారంభించారు. నగరంలోని కస్తూరి గార్డెన్స్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. మంగళగిరి వరకు కొనసాగనుంది. గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ర్యాలీ ప్రారంభం సందర్భంగా మహిళలు ఆయనకు గుమ్మడికాయలతో హరతిచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చంద్రబాబు నాయుడు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పసుపు కండువాలు కప్పుకోనున్నారు.