జగన్ పై గెలవడానికి పవన్ కళ్యాణ్‌ ఏమైనా దేవుడా.. జ్యోతిష్యుడా? – మంత్రి రోజా

-

జగన్‌ సర్కార్‌ పై తలపడేందుకు పవన్ కళ్యాణ్‌ ఏమైనా దేవుడా.. జ్యోతిష్యుడా? అని ఫైర్‌ అయ్యారు మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు, లోకేష్‌ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు అని ఆగ్‌రహించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అన్ని హామీలు నెరవేర్చిన సీఎంను ఏపీలో మాత్రమే చూడగలమని.. 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి దేశంలో ఎవరూ చేయలేనంత గొప్ప పని చేశారు.

వైఎస్‌జగన్‌ను సంక్షేమ సామ్రాట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదని తెలిపారు. క్విట్ చంద్రబాబు, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ప్రజలు చంద్రబాబును మొన్నటి ఎన్నికల్లో తరిమికొట్టారు.

మళ్లీ ఇప్పుడు ఎన్నికలొస్తుండటంతో వానపాములు కూడా లేచి బుస కొడుతున్నాయని నిప్పులు చెరిగారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్కరోజైనా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చేశారా? చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయాడు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. సీఎం వైఎస్‌ జగన్‌ తప్పించుకుని పారిపోలేదని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు ఆర్కే రోజా.

Read more RELATED
Recommended to you

Latest news