కృష్ణం రాజు సినిమాల్లో రెబల్ స్టార్, రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ – రోజా

-

కృష్ణం రాజు సినిమాల్లో రెబల్ స్టార్, రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ అని ఏపీ మంత్రి రోజా పేర్కొన్నారు. ప గో జిల్లాలో కృష్ణం రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రులు రోజా, చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు.

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. రాజకీయాల్లో, సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఘనత కృష్ణం రాజు కే దక్కుతుంది..కృష్ణం రాజు గురించి ఏ ఒక్కరూ తక్కువగా మాట్లాడరని తెలిపారు. కృష్ణం రాజు మృతి కుటుంబానికి తీరని లోటు..కృష్ణం రాజు – వైఎస్ఆర్ కి మంచి అనుబంధం వుందని గుర్తు చేశారు.

భౌతికంగా ఆయన దూరమైన ఆయన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ది ఎవ్వరూ మరువలేరు..కృష్ణం రాజు సినిమాల్లో రెబల్ స్టార్, రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ అని కొనియాడారు. కృష్ణం రాజు ఆశయాలకు తగ్గట్టు ప్రభాస్ సినీ రంగంలో మరింత పేరు తెచ్చుకోవాలని రోజా వెల్లడించారు. కృష్ణం రాజు సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా మొగల్తూరు తీర ప్రాంతంలో రెండు ఏకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news