తెలుగు ప్రజలకు గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా… ప్రజలు రాజకీయంగా చైతన్యం చేసిన వ్యక్తి ఎన్టీర్ గారని… పిల్లనిచ్చిన మామను వెన్నుపొటు పొడిచి, ఆయన పార్టీని, గుర్తును లాక్కున్నాడని.. పార్టీ పేరుతో బ్యాంకులో ఉన్న డబ్బును దోచుకున్నాడని చంద్రబాబును విమర్శించారు మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏమైనా చేయగలడని.. ఆయన 40 ఇండస్ట్రీ అని చెబుతున్నాడని.. కానీ ఆయన లైఫ్ అంతా 420 హిస్టరీ అని ఆమె విమర్శించారు. మహానాడులో కనీసం ఎన్టీఆర్ పేరును ప్రస్తావించలేదని… ఆయన చేసిన మంచి పనులను గురించి చెప్పడం లేదని అన్నారు ఆమె. జగన్ మోహన్ రెడ్డిని చూస్తే చంద్రబాబుకు తడిచిపోతోందని విమర్శించారు. తెలుగు దేశం జెండా ఎగిరే ఏ కార్యకర్త ఇంటికైనా వెళ్తామని… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కన్నా వైసీపీ ప్రభుత్వంలోనే టీడీపీ కార్యకర్తలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఆమె అన్నారు. చంద్రబాబు ఆయన ఛానెళ్లలో దొంగ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మానిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తొలగించిన చరిత్ర చంద్రబాబుది అని అన్నారు. మా ఫ్యాన్ గాలికి చంద్రబాబు, లోకేష్ బాబు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదుని అన్నారు.
పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది: ఆర్కే రోజా
-