జగన్ ప్రభుత్వం పై రఘురామరాజు వివాదాస్పద వ్యాఖ్యలు

-

జగన్ ప్రభుత్వం పై రఘురామరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  పోలవరం ప్రాజెక్ట్ 45.5 మీటర్లకు వెళ్తున్నామా?, 41. 15 మీటర్లే ఫైనల్ అన్నట్లుగా చెప్పడం విడ్డూరంగా ఉందని, 41.15 మీటర్లు తొలి దశ పూర్తి అయిన తర్వాత, రెండవ దశ ప్రాజెక్టు పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని రఘురామకృష్ణ రాజు గారు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా, పెద్ద డ్యాంగా నిర్మించాల్సిందేనని, కానీ దీనిని ఒక బ్యారేజీగా నిర్మిస్తున్నారని తెలిపారు.

ఇప్పటికే రాజధాని అన్నది రాష్ట్ర ప్రజలకు లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి గారు మూడు రాజధానులు అని పేర్కొంటున్నారని, అమరావతి నా?, విశాఖపట్నం అన్నది రాష్ట్ర రాజధానిగా చెప్పుకోలేని దుస్థితి ప్రజలకు ఏర్పడిందని అన్నారు. పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని రాష్ట్ర మంత్రి రోజా గారు చెబుతున్నారని, కానీ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా వచ్చింది లేదని, రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు ఎందుకు క్యూ కడుతారని ప్రశ్నించారు. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారనేడి బూటకమని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును జూన్ 2025 నాటికి పూర్తి చేస్తారా?, లేకపోతే 2024 నాటికి పూర్తి చేయకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తారా?? అని అపహాస్యం చేశారు.

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టును జగన్ మోహన్ రెడ్డి గారి ఉదాసీన వైఖరితో, బండ్ కుంగిపోతున్నా మాజీ ముఖ్యమంత్రి గారిని, గత కాంట్రాక్టర్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 41.15 మీటర్లను పూర్తి చేయడానికి దాదాపు 12 వేల కోట్ల రూపాయలు, అలాగే రిపేర్ల కోసం రెండు వేల కోట్ల రూపాయలు కావాలని జగన్ అండ్ కంపెనీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని, బండ్ కుంగిపోతే జగన్ మోహన్ రెడ్డి గారు 1000 మంది పోలీసుల సంరక్షణలో పోలవరం ప్రాజెక్టును సందర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news