పెళ్లి అనేది ఒక బూతు.. సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. కోలీవుడ్ లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా విలన్ పాత్రలలోనే నటిస్తోంది. ముఖ్యంగా తెలుగులో క్రాక్, వీర సింహారెడ్డి వంటి చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఏజెంట్ , మైకేల్ వంటి చిత్రాలలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. నటుడు శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తాజాగా పెళ్లి పైన పలు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

యాంకర్ ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న సిక్స్త్ సెన్స్ షో కి వరలక్ష్మి శరత్ కుమార్, బిందు మాధవి గెస్ట్ గా రావడం జరిగింది. ఈ సందర్భంగా పెళ్లి గురించి ఓంకార్ ప్రశ్న అడగగా.. ఇద్దరూ కూడా తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది.. వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం క్రాస్ ఫింగర్ చూపించి దాని అర్థం ఏమిటంటే బూతు పెళ్లి మేటర్ నా వద్దకు రావద్దు అంటూ తెలియజేసింది.. పెళ్లి అన్ని సమస్యలను పరిష్కారం అనుకుంటారు కానీ అది నిజం కాదు. మనల్ని మనం అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే మన జీవిత భాగస్వామిని అర్థం చేసుకోగలం అంటూ తెలియజేసింది.

బిందు మాధవి మాట్లాడుతూ.. ఈ టైంలో పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి మనమీద ఉండకూడదు.. ఇది రాంగ్ రిలేషన్ కి దారితీస్తుంది. నా జీవితంలో పెళ్లి చేసుకోవాలనుకునే పర్సన్ ఇంకా రాలేదు.. వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను అని తెలిపింది బిందు మాధవి. ఇక వరలక్ష్మీ మాట్లాడుతూ.. తాను ఏం సాధించినా ఆ క్రెడిట్ మొత్తం తనదేనని… ఇంకా ఎవరూ లేరని తన తండ్రి శరత్ కుమార్ కి కూడా తను నటి కావడం ఇష్టం లేదని తెలియజేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news