విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు..!

-

వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా టీమిండియా శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్ లో 1000 పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 34 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద కోహ్లీ.. ఈ ఘనతను సాధించాడు. ఇదిలా ఉంటే రన్ మిషన్ విరాట్ కోహ్లీ.. ఇప్పటివరకు 8 సార్లు ఓ క్యాలెండర్ ఇయర్ లో 1000 కి పైగా పరుగులు సాధించాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆ రికార్డును చెరిపేశాడు. ఇదిలా ఉంటే.. సచిన్ తన వన్డే కెరీర్ లో ఓ క్యాలెండర్ ఇయర్ 7 సార్లు 1000 కి పైగా పరుగులు నమోదు చేశాడు. మొత్తంగా ఇప్పటివరకు 288 వన్డేలు ఆడిన విరాట్.. 58.19 సగటుతో 13499 పరుగులు సాధించాడు. కోహ్లీ వన్డే కెరీర్ లో 48 సెంచరీలు, 70 హాఫ్ సెంచరీలున్నాయి. కోహ్లీ మరో సెంచరీ చేస్తే.. వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేస్తాడు.

ఇదిలా ఉంటే.. శ్రీలంకతో మ్యాచ్ లో సెంచరీ చేసి సచిన్ రికార్డు బద్దలు చేస్తాడనుకుంటే.. కోహ్లీ 88 పరుగుల వద్ద ఔట్ మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. కోహ్లీ సెంచరీ సాధిస్తాడని ఎంతో ఆశతో ఉన్న విరాట్ అభిమానులకు నిరాశ ఎదురైంది.

Read more RELATED
Recommended to you

Latest news