అభ్యర్థుల మార్పు ప్రచారంపై స్పందించిన సజ్జల

-

అధికార వైసీపీ కొంతమంది అభ్యర్థులను మారుస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. అయిదు నెలల పాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి అభ్యర్థులను ఎంపిక చేశామని.. అలాంటిది ఇప్పుడు అభ్యర్థుల మార్పు ఎందుకు ఉంటుంది..? అని ప్రశ్నించారు. అభ్యర్థుల మార్పు విషయంలో గందరగోళం టీడీపీ కూటమిలోనే ఉందని.. అది కవర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా నలుగురు వ్యక్తులు వచ్చి చేరారని వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేశారు.

అలాగే చంద్రబాబుపైన తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తారని.. నాలుగు ఓట్లకోసం అబధ్ధపు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థ పై నమ్మకం ఉంటే.. ఇన్నాళ్లు చంద్రబాబు మాట్లాడిన మాటల సంగతి ఏంటి అని నిలదీశారు. వాలంటరీల వ్యవస్థపై గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తప్పుగా మాట్లాడిన విషయాలను గుర్తుచేశారు. వాలంటరీ వ్యవస్థ తీసేస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆ వ్యవస్థ కొనసాగిస్తాం అంటున్నారని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడున్న వాలంటరీలను తీసేసి జన్మభూమి కమిటీ సభ్యులతో నింపుతారని సజ్జల ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news