ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా APCC చీఫ్ షర్మిల, దివంగత వివేకా కూతురు సునీత నిన్న సమావేశమై వచ్చే ఎన్నికల్లో పోటీపై చర్చించినట్లు తెలుస్తోంది. కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి షర్మిలా లేదా సునీత/ఆమె తల్లి సౌభాగ్యమ్మ బరిలో ఉంటారని సమాచారం.
తాను ఇక్కడే ఉండి అన్ని చూసుకుంటానని షర్మిల వారికి భరోసా ఇచ్చారట. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్, భాస్కర్ రెడ్డి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉండగా ప్రతి రోజూ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ.. వైఎస్ షర్మిల కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక నిన్న సాక్షి పత్రికలో తనకూ భాగముందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
‘జగన్ కి, నాకు సమాన భాగం ఉండాలని YSR నిర్ణయించారు. ఇప్పుడు అదే సాక్షి పత్రికను వాడుకుని నాపై దూషణలు చేస్తున్నారు. ఇంత నీచానికి దిగజారాల్సిన అవసరం ఏముంది? పోలవరం, ప్రత్యేక హోదా, అభివృద్ధి ఇలా వివిధ అంశాలపై మాట్లాడుతున్నా. ఒక్క సమస్యపైనా సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు’ అంటూ ఫైర్ అయ్యారు.