పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని షర్మిల వినూత్న నిరసన..!

-

ఇటీవల కురిసిన భారీ వర్షాలు , వరదలతో మండలంలో పంటలు నష్టపోయిన రైతులకు తక్షణం ప్రభుత్వం ఎకరానికి రూ. 20 వేల చొప్పున పరిహారం అందించాలని షర్మిల డిమాండ్ చేశారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుం లోతు నీళ్లలో దిగి వినూత్నంగా నిరసన చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పంట నీట మునిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. వారికి తక్షణమే సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని.. రైతుల క్షేమమే మనందరి క్షేమం అని తెలిపారు. రైతులు కన్నీరు పెడితే మన దేశమే కన్నీరు పెడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఎప్పుడూ పోరాడుతుందని.. రైతులను ఆదుకుంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news