వాహనదారులకు జగన్ సర్కార్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఏపీ సర్కార్ 2020, అక్టోబర్ 21 న కొత్త జరిమానాలు అమలుపై ఉత్తర్వులు ఇచ్చింది. రవాణాశాఖ సాఫ్ట్వేర్ లో మార్పు చేశారు. కరోనా కారణంగా కేంద్రం కొన్ని వెసులుబాట్లు ఇవ్వడంతో ఇప్పటి వరకు అమలు చేయలేదు. పర్మిట్ లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లు, ఫిట్నెస్ సర్టిఫికెట్ల పునరుద్ధరణ జరగకపోయినా… మినహాయింపు ఇస్తూ, ఆ గడువును పెంచుతూ వచ్చారు.
2020 మార్చి నుంచి, 2021 అక్టోబర్ దాకా మినహాయింపు ఇచ్చారు. గత ఏడాది నవంబర్ నుంచి మాత్రం పెంచలేదు. గత రెండు మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఉల్లంఘనలకు జరిమానాలు విధిస్తున్నారు.
2020 లో వచ్చిన కొత్త జీవో ప్రకారం ఈ జరిమానాలు ఉన్నాయి. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులపై వాగ్వాదానికి దిగుతున్నారు. తామేమీ చేయలేమని, కొత్త సాఫ్ట్వేర్ లో నమోదు చేసిన మెరుగై నిర్మాణాలు వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా గతంలో పోలీసులకు 100, 150 రూపాయలు ఇస్తే వాహనదారులు వదిలేసేవారు. కానీ ఇప్పుడు దానికి పూర్తిగా విరుద్ధంగా పరిస్థితులు నెలకొన్నాయి.