రైతులను దొంగలుగా చేస్తున్నారు..వ్యవసాయ మీటర్లుపై సోమిరెడ్డి ఫైర్‌

-

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల బిగింపుపై సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఉద్యమిస్తామని.. మీటర్లు బిగిస్తే 30 శాతం విద్యుత్ ఆదా అవుతుందన్న ప్రభుత్వం కామెంట్ల వెనుకున్న అర్థమేంటీ..? అని ఆగ్రహించారు. రైతులను దొంగలుగా ప్రభుత్వం భావిస్తోందా..? మీటర్లు పెట్టకపోతే వచ్చే నష్టమేంటీ..? అని ప్రశ్నించారు. విద్యుత్ దోచేయడానికి రైతులు దొంగలు కాదని.. ఆదా అయిన కరెంటుతో గృహ విద్యుత్ ఛార్జీలేమైనా తగ్గిస్తారా..? అని నిలదీశారు.

మద్దతు ధరకు అమ్ముకున్న రైతులు కేవలం 2 శాతం మాత్రమే ఉంటారని.. అందరికీ కనీస మద్దతు ధర ఇప్పించామని ప్రభుత్వం నిరూపించగలదా..? అని ఫైర్‌ అయ్యారు.

రైతులకు ధాన్యం కొనుగోళ్లల్లో న్యాయం చేశామని ప్రభుత్వం గుండె మీద చేయించగలదా..? ఏపీలో రెండున్నరేళ్ల జగన్ పాలనలో 2112 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. వీళ్లల్లో కౌలు రైతులు ఎక్కువగా చనిపోయారని.. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 718 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అంటోందన్నారు. రైతు భరోసా ద్వారా రూ. 1.10 వేల కోట్లు ఇచ్చామని సీఎం జగన్ గొప్పులు చెప్పుకుంటున్నారని.. జగన్ ప్రభుత్వంలో ధాన్యం రైతుల పరిస్థితి దైన్యంగా ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news