Somu Veerraju : రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి సోము వీర్రాజు పోటీ..!

-

ఏపీలో పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు, అభ్యర్ధులపై బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ మేరకు బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన ఇవాళ ఉదయం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగనుంది. విజయవాడ బీజేపీ కార్యాలయంలో సమావేశం జరుగనుంది. రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి సోము వీర్రాజు పోటీ..!? చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Somu Veerraju is contesting from Rajahmundry assembly seat

ఇక ఇవాళ ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్ధులను ఖరారు చేయనున్న
బీజేపీ అగ్ర నాయకత్వం. బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే… విజయవాడ-వెస్ట్, బద్వేల్, దర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్-నార్త్, ఆదోని, పాడేరు, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలు దాదాపు ఖరారు అయ్యాయి. అనపర్తి అసెంబ్లీ స్థానానికి బదులుగా రాజమండ్రి అసెంబ్లీ స్థానాలను కూడా కోరుతోంది బీజేపీ. అదనంగా రాజంపేట అసెంబ్లీ స్థానం కూడా కోరుతున్న బీజేపీ… క్షత్రియ సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేయాలంటే రాజులకే (క్షత్రియులు) ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news